Election Updates: కేసీఆర్​కు తృటిలో తప్పిన ప్రమాదం..

Election Updates: KCR narrowly missed an accident..
Election Updates: KCR narrowly missed an accident..

ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్​నగర్​లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మక్తల్‌, దేవరకద్ర, నారాయణపేట, గద్వాల్‌లో BRS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన దృష్యా BRS కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తన ప్రచార పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​లో బయల్దేరారు. బయల్దేరిన కొద్దిసేపటికే సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్‌ చేశారు.

అనంతరం ఏవియోషన్ సంస్థకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆ సంస్థ వెంటనే మరో హెలికాప్టర్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ రాగానే సీఎం కేసీఆర్‌ పాలమూరు వెళ్లనున్నారు. కేసీఆర్‌ పాలమూరు పర్యటన యథావిథిగా కొనసాగనుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గ రహదారులన్నీ గులాబీ మయమయ్యాయి. సీఎం సభ కోసం లక్షల మంది కార్యకర్తలు తరలివస్తున్నట్లు.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని స్థానిక BRS నేతలు తెలిపారు.