ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్రావు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువా వేసి షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్, వైకాపా కోసం ఎంతో కష్టపడ్డానన్నారు.
ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని.. అలాంటి తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మాకు YSR దేవుడు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. షర్మిలలో YSR ను చూస్తున్నాం. ఆమె నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్ ఒక నియంత.. ఆయన్ను గద్దె దించాలి. కడప ఎంపీగా షర్మిలకు అవకాశం కల్పించాలి’’ అని కృపారాణి అన్నారు