Election Updates: నేటి నుంచి హైదరాబాద్​లో కేటీఆర్ రోడ్ షోలు

Election Updates: KTR road shows in Hyderabad from today
Election Updates: KTR road shows in Hyderabad from today

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్నటిదాక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆయన తన ఫోకస్ అంతా హైదరాబాద్ మహానగరంపై పెట్టారు. గ్రేటర్​ నగరంపై పట్టు కొనసాగించేందుకు ఆయన ప్రచారాని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయన నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి.

కేటీఆర్ ప్రతి రోజ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి సుమారు 9 గంటల వరకు రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 20వ తేదీ వరకు మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 నియోజకవర్గాల్లో రోడ్ షోలకు కేటీఆర్ ప్రణాళిక చేశారు. నగరంలో ఇవాళ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర‌్.. రేపు ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్ ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుంచి గోషామహల్‌, సికింద్రాబాద్‌, నాంపల్లిలో.. ఈనెల 19వ తేదీన అంబర్‌పేట, ముషీరాబాద్, 20న ఉప్పల్, ఎల్బీ నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.