Election Updates: ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలి : సీఎం కేసీఆర్

Election Updates: One should think before voting: CM KCR
Election Updates: One should think before voting: CM KCR

ఇవాళ ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో చాలా సమస్యలుండేవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. తెలంగాణ రాక ముందు కరెంట్, తాగునీటి సమస్యలుండేవి. రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు ఉండాలా..? వద్దా అని ప్రజలను ప్రశ్నించారు కేసీఆర్. ధరణిని తీసీస్తే రైతుబంధు ఎలా వేస్తారని ప్రశ్నించారు కేసీఆర్.

మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ సరిపోతదని అంటున్నారు. 10 Hp మోటార్ పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటాడు.. అసలు 10 Hp మోటార్ ఎవ్వరూ కొనాలి అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించి వేయాలి. ఎవ్వరికీ ఓటు వేస్తే మనం బాగుపడుతాం. ఏ పార్టీ మనకు ఏం చేసింది. ఎవ్వరితో లాభం కలిగింది. రాష్ట్రంలో ఎవ్వరికీ లాభం జరిగింది వంటి విషయాలను తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. జోగురామన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని కోరారు.