Election Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

Election Updates: Pawan Kalyan meets Chandrababu Babu
Election Updates: Pawan Kalyan meets Chandrababu Babu

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు.

ఇప్పటికే తెదేపా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో తెదేపా ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యం లో చంద్రబాబుతో పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.