Election Updates: తెలంగాణ ప్రజలు BRS కి గుడ్ బై చెప్పబోతున్నారు: అమిత్ షా

TS Politics: Union Minister Cancels Telangana Tour
TS Politics: Union Minister Cancels Telangana Tour

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కి మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2024లో మళ్లీ నరేంద్ర మోడీనే ప్రధాని అవుతారని తెలిపారు. బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. జమ్మికుంటలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడరారు. బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఓటర్లను కోరారు. వారసులకు పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నామని విమర్శించారు.

మహబూబాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబడుతుంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయని తెలిపారు. తెంగాణకు తరువాత సీఎం బీజేపీ నుంచి రాబోతున్నారు. తెలంగాణ తొలి బీజేపీ సీఎం అవ్వనున్నారు. అందులో బీసీకీ చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కానున్నారు. తెలంగాణ ప్రజలపై నమ్మకం బీజేపీపై ఉందన్నారు.బీజేపీ వాగ్దానం బీసీకిచెందిన వాడు సీఎం అవుతాడు. అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తుంది. బీఆర్ఎస్, కాంత్రెస్ రెండు ఒక్కటే.. బీఆర్ఎస్ కి వేస్తే కాంగ్రెస్ కి.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం రూ.7లక్షల కోట్లను అందజేసింది. తెలంగాణలో బిజేపీ అధికారంలోకి వచ్చాక.. తొలి క్యాబినెట్ భేటీలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నాం .