Election Updates: చంద్రబాబుతో పురందేశ్వరి, పవన్ భేటీ.. ఆ స్థానాలపై చర్చ..!

Election Updates: Purandeshwari, Pawan meet with Chandrababu.. Discussion on those seats..!
Election Updates: Purandeshwari, Pawan meet with Chandrababu.. Discussion on those seats..!

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కోయంబత్తూరు పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రచారశైలి, భవిష్యత్తు కార్య చరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల మధ్య సమాలోచనలు జరిగే అవకాశముంది.