TG Politics: ఎమ్మెల్సీ కవిత మళ్ళీ షాక్.. పిటీషన్ తిరస్కరించిన కోర్టు

BREAKING NEWS: Another shock for Kavitha.. Judicial custody till 23rd of this month
BREAKING NEWS: Another shock for Kavitha.. Judicial custody till 23rd of this month

MLC కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా కోర్టు తిరస్కరించింది. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే CBI తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ CBI అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తందని కవిత అవేదన వ్యక్తం చేశారు.

అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు. జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీని సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు. మరికాసేపట్లోనే సీబీఐ కస్టడీ తీర్పు వెల్లడి కానుంది.