బీఆర్ఎస్ పాలనలో వైన్ మాఫియా, ల్యాండ్, సాండ్ వీఫరీతంగా పెరిగిపోయిందని, వీటి ద్వారా వచ్చే డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బోధనలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు దళిత బంధువులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఇవ్వండి దళిత బంధు ఇవ్వడంలేదని ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను డైవర్ట్ చేసిందన్నారు.
రాష్ట్రంలో ప్రజల పాలన అనేది కనిపించడం లేదని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందన్నారు. రాబోయే పదేళ్లు ప్రజల తెలంగాణ ఉండబోతుందని చెప్పారు. బీఆర్ఎస్, బిజెపి పాలనలో గ్యాస్ సిలిండర్ రూపాలు 1200 ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూపాయలు 500 కే ఇస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం అందుబాటులోకి వస్తేనే పేదల బ్రతుకులు మారుతాయని రాహుల్ గాంధీ తెలిపారు.