కాంగ్రెస్ కార్యకర్తల మీద మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి చేసుకున్నారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఉదయం మునుగోడులో ప్రచార సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
ఇన్నిరోజులు బీజేపీలో ఉండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చావు అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. ఈ తరుణంలోనే.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయి చేసుకున్న వారిని బండ బూతులు తిట్టారని సమాచారం. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 రోజుల కిందట బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.