Election Updates: తెలంగాణాలో 68 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ!

Election Updates: Rejection of nominations of 68 candidates in Telangana!
Election Updates: Rejection of nominations of 68 candidates in Telangana!

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. కొన్ని నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం కూడా జరిగింది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో… వాటిని పరిశీలన చేస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4798 మంది నామినేషన్లు వేశారు. అయితే తాజాగా వీటిలో 68 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

ఇందులో భాగంగానే నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి ఈ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.వాస్తవానికి ఇక్కడి నుంచి ఆయన తనయుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. రెండు నామినేషన్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఏడు మానకొండూరు నియోజకవర్గం లో, అలాగే మూడు నామినేషన్లు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి తిరస్కరించారు. ఇటు ఈటెల రాజేందర్ భార్య ఈటల జమున నామినేషన్ కూడా తిరస్కరించారు ఎన్నికల అధికారులు.