టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున.. ఆటంకం కలిగించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందుకే తనకు కనీస భద్రత కల్పించాలి కోరారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. కనీసం ఆరుగురు+ఆరుగురు లెక్కన అయినా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాబోవు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని డీజీపీకి విన్నవించారు.
తగిన భద్రత కల్పించనట్లయితే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తిరిగి న్యాయస్థానాన్ని రేవంత్ రెడ్డి ఆశ్రయిస్తానని లేఖలో హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ రేవంత్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రచారానికి అధికార బీఆర్ఎస్ పార్టీ ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని డీజీపీ, ఈసీకి లేఖ రాశారు.