Election Updates: బర్రెలక్కకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మద్దతు

Election Updates: RS Praveen Kumar supports Barrelakka
Election Updates: RS Praveen Kumar supports Barrelakka

BSP తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బర్రెలక్కకు మద్దతు తెలిపారు. BSP తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క (శిరీష) సోదరుడిపై జరిగిన దాడిని ఖండించారు. ‘శిరీష సోదరుడిపై దాడి అత్యంత గర్హనీయం. ఈ దాడి కారకులను వెంటనే అరెస్టు చేయాలి.

రాజకీయాలు కేవలం ఆధిపత్య వర్గాల వారే చేయాలా? గతంలోనూ శిరీష ఉద్యోగాలు రాక బర్రెలు కాసుకుంటున్నానని వీడియో పెట్టినందుకు ఆమెపై కేసులు పెడితే BSP మద్దతు ఇచ్చింది’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణ బర్రెలక్క గురించి తెలియని వారుండరు. అప్పట్లో బర్రెలతో కనిపించి వైరల్‌ గా మారిన బర్రెలక్క, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే, తెలంగాణ బర్రెలక్క శిరీషకు మద్దతుగా ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి, యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు.