Election Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు

Election Updates: Single day elections in Telugu states
Election Updates: Single day elections in Telugu states

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ, ఏపీ ఎన్నికలు ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎంతో ఆసక్తిగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అనుకున్నట్టుగానే ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగో దశలో జరుగనున్నాయి. మే 13న తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

జూన్ 04న కౌంటింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 4దశలో జరుగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26 రెండో దశ, మే 07, మే13 నాలుగో దశ, మే 20 5వ దశ, మే 25 ఆరో దశ, జూన్ 01 న 7వ దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో చిన్నపిల్లలు ప్రచారం పాల్గొనకూడదని సూచించింది సీఈసీ. అదేవిధంగా వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని హెచ్చరించింది.