Election Updates: వైసీపీ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లింది: బాలకృష్ణ

Election Updates: State went back ten years under YCP rule: Balakrishna
Election Updates: State went back ten years under YCP rule: Balakrishna

ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఓవైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, మరోవైపు వైఎస్సార్సీపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాను ముచ్చటగా మూడోసారి శాసనసభ్యుడిగా గెలిచి హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో జరిగే ఎన్నికలు మహా సంగ్రామం లాంటివని బాలయ్య అన్నారు. అందువల్ల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎం జగన్పై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని, ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని ఆరోపించారు. మద్యనిషేధం అమలు చేయక కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్న బాలకృష్ణ.. ఇలాంటి రాష్ట్రానికి సమర్థమైన పాలన అందించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే చంద్రబాబునాయుడి ద్వారానే సాధ్యమని అన్నారు.