Election Updates: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు రాజీనామా

Election Updates: Telangana Transco, Genco CMD Prabhakara Rao resigns
Election Updates: Telangana Transco, Genco CMD Prabhakara Rao resigns

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు రాజీనామా చేశారు.ఈయన హయాంలోనే తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని తెలంగాణ అధిగమించింది. వ్యక్తిగత కారణాల చేతనే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు ప్రభాకర్. మరి కొత్తగా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ఎవరు అవుతారో చూడాలి.

ఇది ఇలా ఉండగా…కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమై సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. ఈ భేటీలో సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే సాయంత్రానికి సీఎం ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భేటీ అయ్యారు.