నవంబర్ 30న తెలంగాణాలో జరగనున్న ఎన్నికలలో అసలైన పోటీ కేవలం కాంగ్రెస్ మరియు అధికార పార్టీ BRS మధ్యనే ఉండనుంది అని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. కాంగ్రెస్ కు మరియు అధికారంలో ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ సర్వే ఫలితాలు కూడా చెబుతున్నాయి. ఇక తాజాగా BRS మరియు కాంగ్రెస్ పార్టీలు ట్విటర్ కేంద్రంగా ఒకరిపై ఒకరు కౌంటర్ లు ఇచ్చుకుంటూ ఎన్నికలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. BRS సోషల్ మీడియా వేదికగా కరెంట్ కావాలా ? కాంగ్రెస్ కావాలా ? అంటూ పోస్ట్ చేయగా, దీనికి సమాధానంగా కాంగ్రెస్ కరెంటా కాంగ్రెస్సా కాదు కరెంట్లీ కాంగ్రెస్ అని బదులుగా ట్వీట్ చేసింది.
ఈ రిప్లై కు మళ్ళీ BRS మా హ్యాష్ టాగ్ CURRENTAA CONGRESSAA ట్రెండింగ్ లో పాల్గొన్నందుకు థాంక్స్, మీ పార్టీ క్యాడర్ కూడా నవంబర్ 30న BRS కు ఓటు వేయడానికి క్యూ కడతారు అంటూ ట్వీట్ చేసింది.. ప్రస్తుతం ఈ ట్విటర్ వార్ తెలంగాణాలో వైరల్ అవుతోంది.