Election Updates: మేడిగడ్డను చూసేందుకు మోదీ ఎందుకు వెళ్లలేదు: రేవంత్ రెడ్డి

Election Updates: Why Modi did not go to see Medigadda: Revanth Reddy
Election Updates: Why Modi did not go to see Medigadda: Revanth Reddy

మేడిగడ్డ కుంగినా బాధ్యులపై కేంద్రం చర్యలు తీసుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడిగడ్డను చూసేందుకు వెళ్లాలని మోదీని కోరానని.. కానీ మోదీ మాత్రం సభకు వచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీజేపీకి 100 సీట్లల్లో డిపాజిట్లే రావన్న రేవంత్…బీసీని సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీసీ వ్యక్తిని అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు సీఎం చేయలేదని నిలదీశారు. ఓటు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకే వేయండని..కోట్లు ఉన్నవాళ్లు ఎన్ని నోట్లు ఇచ్చినా తీసుకోండని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం. ఆదివాసీలను, లంబాడీలను కాపాడుకునే పార్టీ కాంగ్రెస్‌. ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదాలను పరిష్కరిస్తాం. ఆదివాసీలు, లంబాడీలు నాకు రెండు కళ్లు వంటి వారు. ఎకరాకు ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్లు ..హనుమాన్‌ గుడి లేని ఊరే లేదు. ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. ధరణి లేకపోతే రైతుబంధు రాదని కేసీఆర్‌ చెబుతున్నారు. రైతుబంధు వచ్చింది 2018లో…ధరణి 2020లో వచ్చింది. 2018 నుంచి 2020 వరకు ధరణి లేకుండానే రైతుబంధు ఎలా వచ్చింది?’ అని రేవంత్ ప్రశ్నించారు.