నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 622 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 1,314కి చేరింది. ఈ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇవాళ మంత్రి హరీష్ రావుతో పాటు పలుచోట్ల ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు సిద్ధిపేటలో నామినేషన్ వేయనున్నారు.
కాగా, ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను ఆంగ్ల, తెలుగు భాషల్లో పార్టీలు సమర్పించాలని…ప్రవర్తనా నియమావళికి లోబడే పథకాలున్నట్లు ధృవీకరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శాసనసభ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు, సీఈఓ సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఈసీ మార్గదర్శకాలను వివరించారు. నామినేషన్ల పరిశీలనలో నలుగురికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీలు 40 మంది స్టార్ క్యాంపెనర్ల జాబితాను నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వారంలోపు ఇవ్వాలని తెలిపారు.