Election Updates: తెలంగాణ ఉద్యోగులకు షాక్… సోమవారం సెలవు రద్దు ?

Election Updates: Shock for Telangana employees...Cancellation of Monday holiday?
Election Updates: Shock for Telangana employees...Cancellation of Monday holiday?

తెలంగాణ ఉద్యోగులకు షాక్, దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజున సెలవు ఇస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

సెలవు ఇస్తే ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సెలవుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొదట ఏపీలోని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఇక నిన్న తెలంగాణలోని విద్యాసంస్థలకు కూడా 3 రోజులపాటు సెలవులు ఉండనున్నట్లు వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజున అంటే 12వ తేదీన దీపావళి సెలవు ఉండగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాన్ని సోమవారానికి మార్చేశాయి. దీంతో ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కలిసి వచ్చాయి.