Election Updates: సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి ఇచ్చింది ఎవరు : కేసీఆర్

Election Updates: Who gave 49 percent stake in Singareni to the Centre: KCR
Election Updates: Who gave 49 percent stake in Singareni to the Centre: KCR

సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి ఇచ్చిన దద్దమ్మలు ఎవరు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇవాళ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధిన ప్రజా ఆశీర్వాద సభ మందమర్రిలో నిర్వహించారు. సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాసులు ఢిల్లీలో ఉంటారని.. ఎవ్వరికైనా టికెట్ ఇవ్వాలన్నా ఢిల్లీలో డిసైడ్ చేయాలన్నారు. కానీ బీఆర్ఎస్ కి ఢిల్లీ బాసులు ఎవ్వరు లేరు అని.. ప్రజలే బాసులు అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఢిల్లీ బాసులు చెప్పినట్టు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఉండాల్సిందేనన్నారు. నిజాం రాజు ఉన్నప్పుడు పెట్టుకున్న కంపెనీ సింగరేణి మన తెలంగాణ కంపెనీ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నడపలేక కేంద్రానికి వాటా ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ముసుగు మార్చుకొని పార్టీ మారారు. సింగరేణిలో 10 బిలియన్ల టన్నుల బొగ్గు తెలంగాణలో ఉందని తెలిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మకూడదన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.