విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య

విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఐటీ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్‌కు చెందిన సాత్విక గౌడ్‌ సీఎంఆర్‌ఐటీలో బీటెక్‌ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. శనివారం రాత్రి డిన్నర్‌కు పిలిచేందుకు స్నేహితురాలు సాత్విక గదికి వెళ్లగా అప్పటికే ఆమె ఏడుస్తూ కూర్చుంది.

దీనిపై స్నేహితురాలు ప్రశ్నించగా మిడ్‌ ఎగ్జామ్స్‌ ఉన్నా.. ఏమీ చదవలేదని చెప్పింది. అంతేగాక మమ్మీ కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తెలిపింది. తాను తర్వాత తింటానని చెప్పడంతో మీ రూమ్‌మెట్స్‌ లేరు కదా ఒంటరిగా పడుకోవద్దని తన గదికి రావాలని చెప్పి స్నేహితురాలు వెళ్లిపోయింది.ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె కని పించకపోవడంతో స్నేహితులు ఆమె కోసం గాలించారు.

బాత్‌రూమ్‌ డోర్‌ తలుపులు కొట్టగా ఎంతకీ తెరుచుకోవపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌కు సమాచా రం అందించారు. వార్డెన్‌ సిబ్బంది సాయంతో బాత్‌రూం తలుపులు పగులగొట్టి చూడగా సాత్విక సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో మేడ్చల్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.