27 ఏండ్ల తర్వాత సెమీస్‌కు ఇంగ్లండ్

England gone to semis after twenty seven years

ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ అదరగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ 27 ఏండ్ల తర్వాత తొలిసారి నాకౌట్ బెర్తు దక్కించుకుంది. బెయిర్‌స్టో సూపర్ సెంచరీతో మరోమారు కదంతొక్కిన వేళ పోరాడే స్కోరు అందుకున్న మోర్గాన్‌సేన..కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ రెక్కలు విరిచింది. అనామక జట్లపై అలవోక విజయాలతో ఆదిలో జోరు కనబరిచిన కివీస్..ఆఖరి దశలో వరుస ఓటములతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లండ్ విజయంతో మిణుకు మిణుకుమంటున్న పాక్ నాకౌట్ ఆశలు కనుమరుగయ్యాయి.