కొర‌టాల సినిమాలో చిరు లుక్ ఇదేనా ?

chiru look in koratala movie

దాదాపు 8 ఏళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి జోరుమీదున్నారు. ఇటీవ‌లే సైరా న‌ర‌సింహ‌రెడ్డి అనే క్రేజీ ప్రాజెక్ట్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన చిరు ప్ర‌స్తుతం కొర‌టాల సినిమా కోసం రెడీ అవుతున్నాడ‌ట‌. ఇందులో చిరు కాస్త స్లిమ్‌గా క‌నిపించాల్సి ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న స‌ల్మాన్ ట్రైన‌ర్ ఆధ్వ‌ర్యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆహార నియ‌మాలు కూడా పాటిస్తూ స‌రికొత్త లుక్‌లో క‌నిపించేందుకు చిరు సిద్ద‌మ‌య్యాడ‌ట‌. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇందులో కాస్త స్లిమ్‌గా క‌నిపిస్తూ అభిమానుల మ‌న‌సులు చూరగొంటున్నాడు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబర్ నెల‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, ఆ లోపు చిరు ఇంకాస్త స్లిమ్‌లోకి మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కొరటాల శివ‌- చిరంజీవి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక చిరు న‌టించిన తాజా చిత్రం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం అక్టోబ‌ర్ నెల‌లో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు వంటి ప‌లు టాప్ స్టార్స్ ఇందులో న‌టించారు.