ఏపీలో ఫించన్ల కోతపై విచారణ వాయిదా

కరోనా మహమ్మారి ప్రభావం, లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా దేశమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లలో యాభై శాతం కోత విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. అదేరోజు వాదనలు వింటామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై జంధ్యాల రవికుమార్ ఈ పెన్షన్లను యాభై శాతం కోతను నిరసిస్తూ సాగిన విచారణలో వాదనలు జరిపారు. అయితే ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో యాభై శాతం కోత విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం తొలి కేసుగా ఈరోజు విచారించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్‌లో యాభై శాతం కోత విధించి, పరిస్థితి చక్కబడిన తర్వాత చెల్లిస్తానని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.