షాకింగ్ : 53 మంది జర్నలిస్టులకు కరోనా.

కరోనా మహమ్మారి విశ్వాన్ని వణికించేస్తుంది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా మెల్లిమెల్లిగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు అన్ని రంగాలపై దాడి చేస్తుంది. ప్రభుత్వం లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది.

తాజాగా ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వారెవరికీ కరోనా లక్షణాలు లేవు. అస్సలు శరీరంలో ఏమాత్రం కనిపించలేదు. అయినా బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం బయట పడింది. మొత్తం 193 జర్నలిస్తులు, ఫోటో గ్రాఫర్లకు టెస్టులు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ వచ్చింది. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 4వేలకు పైగా కేసులు నమోదై కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.

ఒక్క ఆదివారం రోజే సుమారు 552 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ ముఖ్యంగా ముంబైలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. ముంబైలోని దారవిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆ ఏరియాలో చాలా దగ్గరంగా నివాసం ఉంటూ సుమారు10లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. దీంతో అక్కడగానీ ఎక్కువగా వ్యాపిస్తే అదుపు చేయడం కష్టంగా మారే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వాలు హడలెత్తిపోతున్నాయి.