నిరాహార దీక్షకి దిగిన సీఎం, డిప్యూటీ సీఎం !

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళనాడు రాష్ట్ర సీఎం అలాగే డిప్యూటీ సీఎం నిరాహార దీక్షకి దిగారు. అదేమిటి సీఎం డిప్యూటీ సీఎం లు నిరాహార దీక్ష చేయడం ఏమింటా అని ఆశ్చర్య పోతున్నారా ? కాని ఇది నిజం. కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అధికార అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం నిరాహార దీక్ష దిగారు. కావేరీ జలాల మేనేజ్‌‌మెంట్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం నిరాహార దీక్షతో రాష్ట్రంలో మరింత అగ్గి రాజుకున్నట్లైంది.

కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్‌ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారని తెలుస్తోంది. స్వయంగా పళని, పన్నీర్‌ ఇద్దరూ రంగంలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి.