తెలంగాణ తొలి ప్ర‌భుత్వ చివ‌రి బ‌డ్జెట్

Etela Rajender introduced Telangana Budget 2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ రాష్ట్ర తొలి ప్ర‌భుత్వం చివ‌రి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ వ‌రుస‌గా ఐదోసారి అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్ధే త‌మ ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని మంత్రి స్ప‌ష్టంచేశారు. ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్ కాద‌ని, ప్ర‌జాక‌ర్ష‌క బ‌డ్జెట్ అని చెప్పారు. టీఆర్ ఎస్ పాల‌న స్వ‌ర్ణ‌యుగ‌మ‌ని, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డంలో ఎన్నో మైళ్లు ప్ర‌యాణించామ‌ని, అణ‌గారిన స్థితిలోనుంచి అభివృద్ధి వైపు సాగుతున్నామ‌ని వ్యాఖ్యానించారు.
బ‌డ్జెట్ వివ‌రాలు ఇలా ఉన్నాయి…

తెలంగాణ మొత్తం బ‌డ్జెట్ రూ. 1,74,453 కోట్లు కాగా, రెవెన్యూ వ్య‌యం 1,25,454 కోట్లు. రెవెన్యూ మిగులు రూ. 5,520కోట్లు. బడ్జెట్ లో వివిధ రంగాల కేటాయింపులు..

సాగునీటి ప్రాజెక్టుల‌కు రూ. 25 వేల కోట్లు
డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌కు రూ. 2,643 కోట్లు
పంట‌ల పెట్టుబ‌డి మ‌ద్ద‌తుకు రూ. 12వేల కోట్లు
రైతు బీమా ప‌థ‌కానికి రూ. 500 కోట్లు
వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ. 522 కోట్లు
మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లకు రూ. 1000 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల‌కు రూ. 5,300 కోట్లు
ఆరోగ్య‌లక్ష్మి ప‌థ‌కానికి రూ. 298 కోట్లు
మ‌హిళా శిశు సంక్షేమానికి రూ. 1,799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 9,693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖ‌కు రూ. 12,709 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖ‌కు రూ. 8,063 కోట్లు
ద‌ళితుల భూ పంపిణీకి రూ. 1,469 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ. 2వేల కోట్లు
అమ్మ‌బ‌డి ప‌థ‌కానికి రూ. 561 కోట్లు
మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ. 1,801కోట్లు
మిష‌న్ కాక‌తీయ‌కు రూ. 25వేల కోట్లు
యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు
వేముల‌వాడ ఆల‌యం అభివృద్ధికి రూ. 100 కోట్లు
బాస‌ర ఆల‌యం అభివృద్ధికి రూ. 50 కోట్లు
భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్ధికి రూ. 100 కోట్లు
పౌర‌స‌ర‌ఫ‌రాల రంగానికి రూ. 2,946కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 5,650కోట్లు
వైద్య ఆరోగ్య‌శాఖ‌కు రూ. 7,375 కోట్లు కేటాయింపులు జ‌రిపింది తెలంగాణ ప్ర‌భుత్వం