గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని పవన్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న శశిభూషణ్, కృష్ణ తేజ , ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నేడు గ్రామాల్లో రోడ్లు, నీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడంలొ కీలక పాత్ర వారిదేనన్నారు. ఈ అభివృద్ధి పనులకోసం నగలు తాకట్టు పెట్టి పనులు చేశారని, నిధులు రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. దీని వల్ల కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వలేక పోయామన్నారు.
