ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని వ్యవహారం అంతటా చర్చనీయమవుతోంది. గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న ఆయన నోటి నుంచి బూతులు యథేచ్ఛగా వస్తుండడంతో అంతా విస్తుపోతున్నారు. దూకుడుగా వ్యవహరించడంతో పాటు అధికారులతోనూ దురుసుగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బూతులు ప్రయోగించిన స్పీకర్ సీతారాం గురువారం మరోసారి తన నోటికి పనిచెప్పారు. సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రభుత్వోద్యోగులపై ఆయన తన జోరు చూపించారు. తంతానంటూ వారిని హెచ్చరించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా ప్రొటోకాల్ పాటించలేదని సాకుతో అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే స్పాట్ లోనే తంతానని హెచ్చరికలు చేయటంపై అధికారులు ఆవేదనకు గురయ్యారు. కార్యక్రమం సమాచారం సమయాభావం మూలంగా ఇవ్వలేకపోయామని అధికారులు సంజాయిషీ ఇచ్చిన్పపటికీ, మీరు డ్యూటీలు సరిగా చేయాలని, లేని పక్షంలో తన్నులు తప్పవనడం అధికారులు తీవ్రంగా నొచ్చుకున్నారు.