తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ లాక్ డౌన్ కి అందరు కూడా సహకరించాలని, ఎవరైనా ఉల్లంగిస్తే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ… కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని, దీనికి అందరు కూడా సహకరించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఇకపోతే అత్యవసరాలకి ఏర్పాటు చేసిన నిత్యావసరాలన్నీ కూడా 7 గంటలకు మూసేస్తామని చెప్పారు. ఇకపోతే ఏదైనా వాహనంతో ఎక్కువసార్లు కనిపిస్తే దాన్ని సీజ్ చేస్తామని ప్రకటించారు. కాగా ఆ వాహనాలన్నీ కూడా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు పెట్టామని, అక్కడ ఉండే పోలీసులు ఈ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి బైక్ పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.