మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. 250 మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని… వీటన్నింటి పైన విచారణ కొనసాగుతుందని తెలిపారు.

