టీఆరెస్ లోకి ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు…!

Ex-Cong-Minister-Jalagam-Pr

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ రాష్ట్ర మంత్రి జలగం ప్రసాదరావు అధికార టిఆర్‌ఎస్‌లోకి రానున్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ప్రసాదరావు గత కొన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నిత్యం తన స్వగ్రామమైన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి వచ్చిపోతూ తన అనుచర వర్గంతో సంప్రదింపులు, చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ జిల్లాలో గట్టిపట్టున్న నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన సోదరుడైన వెంకట్రావు ప్రస్తుతం టిఆర్‌ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితుడిగా పేరున్న ప్రసాదరావును టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి ఎన్నికల సమయాన ఖమ్మంలో ఆయన రాజకీయం వాడుకుందామని భావిస్తున్నట్టు సమాచారం.

jalagam-prasarao-trs

అయితే మూడేళ్ళ క్రితమే ఆయన్ని పార్టీలోకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా జలగం ప్రసాదరావును నియమించే ఆలోచన చేసారని దీనికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరుగింది. అయితే అవీమీ నిజం కాలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ స్వయంగా జలగంను ఫోనులో సంప్రదించి జలగంను పార్టీలో చేరవల్సిందిగా కోరారని దీనికి జలగం తన అనుచరులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు అయన చేరికపై మీన మేషాలు లెక్కపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది.ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ ఆంటోనీ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్నిజలగంకు ఉత్తమ్‌ ఫోన్‌ చేసి చెప్పారు. పార్టీలోకి రావాలని సూచించారు. కానీ. ‘మీకు ఇచ్చిన టైమ్‌ అయిపోయింది. కాంగ్రెస్‌లోకి రాలేను’ అని జలగం చెప్పినట్టు తెలుస్తోంది.దీంతో అయన టీఆర్ఎస్ లో చేరటం ఖాయమని తెలుస్తుంది.టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

jalagam