సీఎం జగన్‌ పాల‌నకు 3 నెల‌ల్లోనే Expire డేట్ – నారా లోకేష్‌

AP Politics: Did you ask the Center anything about special status?: Nara Lokesh
AP Politics: Did you ask the Center anything about special status?: Nara Lokesh

సీఎం జగన్‌ పాల‌నకు 3 నెల‌ల్లో Expire డేట్ అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. నిన్ను మేము సైకో అని ఊరికే అన‌లేదు జ‌గ‌న్! ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిలో సెక్ర‌టేరియ‌ట్ టిడిపి ప్ర‌భుత్వం క‌ట్టిందన్నారు. అందులో కూర్చుని ఇదేం రాజ‌ధాని అంటావు. విశాఖ‌ని రాజ‌ధాని చేస్తానంటావు. కోర్టుల ఆదేశాలున్నా వ్య‌వ‌స్థ‌ల్ని బెదిరించి దొడ్డిదారిన ప్ర‌భుత్వ కార్యాల‌యాల్ని త‌ర‌లించేందుకు జీవోలిప్పిస్తావని ఫైర్‌ అయ్యారు.

టిడిపి స‌ర్కారు ఐటీ డెవ‌ల‌ప్మెంట్ కోసం క‌ట్టిన మిలీనియం ట‌వ‌ర్స్‌ని ఖాళీ చేయిస్తావు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీల‌ని ప‌క్క‌రాష్ట్రాల‌కి త‌రిమేస్తావని నిప్పులు చెరిగారు. వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేస్తావు. రుషికొండ‌ని ధ్వంసం చేశావని ఆగ్రహించారు. కైలాస‌గిరిని నాశనం చేశావు. విశాఖ‌ని విధ్వంసం చేసి ఆ శిథిలాల‌పై కూర్చుని సైకో జ‌గ‌న్ ఏం చేస్తావు! ఇంతా చేస్తే, నీ పాల‌న ఎక్స్పైరీ డేట్ 3 నెల‌లు. మూడు నెల‌ల నీ ముచ్చట ప్ర‌జ‌ల సొమ్ము వేల‌కోట్లు త‌గ‌లేస్తున్నావంటే నిన్ను సైకో అనే అనాలని నారా లోకేష్ ట్వీట్‌ చేశారు.