తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శివకాసి సమీపంలోని థాయిల్పట్టిలో అక్రమ బణాసంచా తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.