2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది.
కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.