మా సినిమాతో పాటు ఆ సినిమాలు ఆడాలి…!

F2 Movie Team Funny Interview

అనిల్ రావి పూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 మల్టీ స్టారర్ చిత్రం రూపొందింది. ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ వైజాగ్ లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ… నాకు వైజాగ్ కు చాలా దగ్గర సంబంధం ఉన్నది. నేను ఇక్కడే నటనలో శిక్షణ పొందాను. గురు, స్వర్ణకమలం,మలిశ్వరి సినిమాలు ఇక్కడ సాగరతీరంలో షూటింగ్ జరుపుకుంది. అలాగే ఈ చిత్రంలో నా కామెడీ టైమింగ్ చాలా భాగ వచ్చింది. మరల నువ్వు నాకు నచ్చావ్.మల్లీశ్వరి వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అంత మంచిగా కామెడీ వచ్చింది. అనిల్ కూడా చాలా చక్కగా ఎఫ్2 సినిమాలో మా నుండి కామెడీ రాబాట్టగాలిగాడు.

ఇకా చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది అన్నారు, మా సినిమాతో పాటుగా చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్టా సినిమాలు కూడా భాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎఫ్2 చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ సరసన మేహ్రిన్ నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటిస్తున్నాడు. వెంకటేష్ ఎఫ్2 చిత్రం నేపద్యంలోనే మరో మల్టీ స్టారర్ సినిమా నాగచైతన్య తో వెంకి మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై వరుణ్ తేజ్ కూడా చాలా ఆశలు పెట్టున్నాడు. మల్టీ స్టారర్ మూవీ అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ను అనిల్ తెరకెక్కించాడని నిర్మాత దిల్ రాజు అన్నాడు.