సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్‌బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్ సొంతం. యూజర్లకు మరింత దగ్గరవ్వడం కోసం ఎల్లప్పుడూ సరికొత్త అప్‌డేట్స్‌తో ఫేస్‌బుక్ వస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ మరో సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది.
ఫేస్‌బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ ఐనా ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ యాడ్ చేసింది. దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను పొందేందుకు తోడ్పడనుంది. లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే ఫేస్‌బుక్‌కు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేయవచ్చును.
ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో అశ్లీలత కీవర్డ్‌ను నిరోధించే సాధనాలు, సస్పెండ్/బ్యానింగ్ నియంత్రణలతో సహా అనేక కామెంట్ మోడరేషన్ సాధనాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేస్‌బుక్ యూజర్ల కోసం ప్రత్యేక భద్రతా సాధనాలను ప్రారంభించడంతో పాటుగా, వారి ఖాతాల నుంచి లాగ్ అవుట్ ఐనా వ్యక్తుల కోసం లైవ్ చాట్ సపోర్ట్ సిస్టమ్‌ను కూడా ప్రకటించింది.