అమ్రుతకి మగబిడ్డ కాదు…అసలు డెలివరీ అవ్వలేదు !

మిర్యాలగూడకు చెందిన అమృతకు మగబిడ్డ పుట్టాడనే వార్త రాష్ట్రమంతటా వైరల్ అయింది. అమృతకు కొడుకు రూపంలో ఆమె భర్త ప్రణయ్ మళ్లీ పుట్టాడనే న్యూస్ ప్రధాన వార్తా ఛానెళ్లు, వెబ్ సైట్లలో మార్మోగింది. సెంటిమెంట్ కు సంబంధించిన వార్త కావడంతో ఎక్కువ మంది నమ్మేశారు. ఐతే ఆ న్యూస్ లో నిజం లేదని అమృత కుటుంబసభ్యులు తెలిపారు. తన డెలివరీపై వస్తున్న వార్తలు ఫేక్ అనీ అలాంటి న్యూస్ నమ్మొద్దని కోరారు. ఈ విషయం ప్రధాన చానెళ్ళకు సంబంధించిన వెబ్ సైట్ లలో కూడా రావడంతో మేము కూడా వెబ్‌సైట్లో ప్రచురించాం. నిర్ధారించుకోకుండా ఈ వార్త ప్రచురించినందుకు మమ్మల్ని మన్నించాలని పాఠకులను కోరుతున్నాం. ప్రణయ్ చనిపోయే నాటికి ఆమెకు ఉన్న నెలల్ని బట్టి అమృత జనవరిలో డెలివరీ అవుతుందని, అయ్యిందని చెబితే నిజిఅమేనని భావించాం. మేం కూడా మా పాఠకులకు వార్తను వేగంగా అందించాలన్న భావనతో వార్తను అందించాం. తర్వాత అసలు విషయం తెలిసింది.