మన సిరివెన్నెల ఇక పద్మశ్రీ !

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. నలుగురికి ‘పద్మ విభూషణ్’, 14 మందికి ‘పద్మ భూషణ్’ .. 94 మందికి ‘పద్మశ్రీ’ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ఆర్ట్స్ – లిరిక్స్ విభాగంలో పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ‘పద్మశ్రీ’ అవార్డు దక్కింది. వంద‌లాది పాట‌లు రాసి తెలుగు వారి అభిమానం చూర‌గొన్న గొప్ప సినీ సాహితీకారుడు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ద‌శాబ్ధాల పాటు పాట‌కు, సినీరంగానికి గొప్ప సేవ‌లందించారాయ‌న‌. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించి గౌర‌వించింది. మ‌ల‌యాళ హీరో మోహ‌న్ లాల్ కు ప‌ద్మ‌భూష‌ణ్‌ని ప్ర‌క‌టించారు. సిరివెన్నెల‌,మ‌నోజ్ భాజ్ పాయ్, ఆల్ రౌండ‌ర్ ప్ర‌భుదేవా, శంక‌ర మ‌హ‌దేవ‌న్, శివ‌మ‌నిల‌కు పద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్కాయి. 112 ప‌ద్మ లు ప్ర‌క‌టిస్తే అందులో తెలుగు రాష్ట్రాల‌కు నాలుగు పుర‌స్కారాలు ద‌క్కాయి. సిరివెన్నెల సీతారామా శాస్త్రి పుర‌స్కారం అందుకోగానే.. ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మారుతి స‌హా మ‌హేష్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సిరివెన్నెల అభిమానులు ఈ పుర‌స్కారం ద‌క్క‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.