ఎస్బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ గుట్టుని రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దీనికి సంబంధించి 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం కాల్ సెంటర్ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు. విచారణలో ఈ ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.