ఆకాశం ఛత్రం కింద అద్దంలా మెరిసే లాగా ఫలక్ నుమా ప్యాలెస్ చార్మినార్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఫలక్‌నుమా అనే ఉర్దూ పదానికి తెలుగులో “ఆకాశ దర్పణం” అని అర్థం. ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ కట్టించిన ఫలక్ నుమా ప్యాలెస్ ప్రపంచంలోని ఉత్తమ భవనాల్లో ఒకటిగా నిలిచింది. ఏడో నిజాం అప్పటి కాలం లో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను “రాయల్ గెస్ట్ హౌస్”గా ఉపయోగించుకున్నారు. తాజ్ హోటల్స్ గ్రూప్ వాళ్ళు 2010లో నిజాం వారసుల నుంచి అద్దెకు తీసుకున్నారు.
చార్మినార్‌కు దూరాన ఉన్న కొండపై శంకుస్థాపన1884లో చేసి పదేళ్ల పాటు 1894 అక్టోబర్‌లో ఈ ప్యాలెస్ పూర్తి నిర్మాణం జరిగినది. ఈ భవనానికి ఈ అక్టోబర్ నెలతో 125 ఏళ్లు పూర్తి అయ్యాయి. 60 గదులు, 22 హాళ్లు ఉన్న ఈ ప్యాలెస్‌లో అపురూపమైన కళాఖండాలు, విగ్రహాలు, ఫర్నీచర్, పుస్తకాలు ఏర్పాటు చేసారు.
ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్‌గా ప్యాలెస్‌లోని ‘101 డైనింగ్ హాల్’ 108 అడుగల పొడవైన టేబుల్స్ 101 మంది కూర్చొని ఒకేసారి భోజనం చేసేలా పేరు పొందింది. సాధారణ ప్రజలను అప్పట్లో ప్యాలెస్‌లోకి అనుమతినిచ్చే వారు కాదు. తాజ్ గ్రూప్ ప్యాలెస్ ను అద్దెకు తీసుకున్న తర్వాత ఇపుడు ఎవరైనా వెళ్లి భోజనం చేసే అవకాశం ఉంది. ఇక్కడ భోజనం చేయాలంటే తక్కువలో 40 మంది ఉండాలి. ఒకరోజు ఉండటానికి సుమారు 46 వేలు చెల్లించవలసి వస్తుంది. కేవలం భోజనం ఖరీదు 5 వేలు చెల్లించాల్సి వస్తుంది.