భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన టి.రవీందర్, వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
దీంతో రవీందర్‌పై గతంలో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.