Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ అనగనే ముందుగా గుర్తొచ్చేది హైదరబాద్ బిర్యానీ, ఇరానీ చామ్.. ఇక రంజాన్ మాసంలో అదే స్థాయిలో గుర్తుకువచ్చే అద్భుత వంటకం హలీం. ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అవటంతో నగరంలో ఎటు చూసినా హలీం ఘుమఘుమలె . ఎక్కడ చూసినా హలీమ్ తయారీ కేంద్రాలు ప్రత్యేకంగా వెలిసి రుచికరంగా హలీం అందిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ హలీం తయారీ సంస్థలు కోరుకున్న వారికి కోరుకున్న రుచుల్లో హలీమ్‌ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. హలీం తయారీలో వివిధ రకాల ఫ్లేవర్స్‌ను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు.
నాన్‌వెజ్‌లో మరిన్ని రకాలతో పాటు శాకాహరుల కోసం వెజ్ హలీంను కూడా అందిస్తున్నారు. హలీం ఎన్నో ప్రొటీన్ లతో కూడిన బలవర్థక ఆహారం. ముస్లింల ఉపవాస దినాలలో వండే ప్రత్యేక వంటకమే అయినా హలీం కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ఇప్పుడు హిందువులు సైతం ఇష్టంగా తింటున్నారు. వీరిలో శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజ్ హలీం తయారు చేస్తున్నారు. తమ వద్ద హలీం కోసం వచ్చే వారిలో దాదాపు 40 శాతం మంది హిందువులుంటారని హలీం సెంటర్ నిర్వాహకులు అంటున్నారు. ఒకరకంగా హలీం నేడు హిందూ, ముస్లింల సమైక్య భావానికి ప్రతీకగా నిలుస్తోంది.
హైదరాబాద్ లో దొరికే హలీం ఒకటేనా అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో టేస్ట్… ఒక్కో బావర్చి(వంటగాడు) చేతిలో ఒక్కో ప్రత్యేక రుచి… హైదరాబాద్ బెస్ట్ హలీం ఎక్కడా అంటే… ఇదిగో మీకోసం ఈ ప్లేస్ లు….
హోటల్ షా గౌస్ కేఫ్ అండ్ రెస్టారెంట్ @ చార్మినార్ & టోలీ చౌకి :

సర్వీ @ బంజారా హిల్స్:

కేఫ్ బహార్ @ బషీర్ భాగ్:

పిస్తా హౌస్ @చార్మినార్:

షాదాబ్ హోటల్ @ చార్మినార్:

హోటల్ ఇక్బాల్ @ యాకూత్ పురా:

గ్రాండ్ హోటల్ @ అబిడ్స్ :

హోటల్ నయాగరా @ మలక్ పేట్:

రుమాన్ హోటల్ @ టోలీ చౌకీ:

