ఇప్పటికే కరోనా బారిన పడిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ బాధ్యతారాహిత్యంగా టోర్నీ నిర్వహించిన జొకో చావాల్సిందేనంటూ పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీల నిర్వహణతో జొకోవిచ్ దంపతులతోపాటు అతని కోచ్ ఇవానిసెవిచ్, మరో ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు.
దీనిపై కొందరు క్రీడా ప్రముఖులు సెర్బియన్ స్టార్‌పై మండిపడ్డారు. తాజాగా క్రొయేషియాలోని స్లి్పట్ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్ చావాలని కోరుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. ‘జొకో నువ్వు చావాలని స్లి్పట్ నగరం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది’ అని నిరసనకారులు రాశారు. మరోవైపు సెర్బియా మహిళా ప్రధానమంత్రి తమ స్టార్ ప్లేయర్‌కు మద్దతుగా నిలిచారు. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని… ఈ విషయంలో నొవాక్‌ను నిందించకూడదని ఆమె కోరారు.