Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్’ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేస్తున్న మూవీ ‘భరత్ అను నేను’. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్లో మరో సూపర్ హిట్ చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుందని సీన వర్గాల వారు అంతా భావిస్తున్నారు. మహేష్‌బాబు ఫ్యాన్స్ ఇది టాలీవుడ్ టాప్ చిత్రాల్లో నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇంతటి భారీ అంచనాలున్న ఈ సినిమాకు రీ షూట్ జరపడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సీన్స్‌పై దర్శకుడు కొరటాల సంతృప్తిగా లేడని, దాంతో వాటిని మళ్లీ రీ షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. రీ షూట్‌కు మహేష్‌బాబు మరియు నిర్మాత కూడా ఓకే చెప్పాడు. దాదాపు వారం రోజుల పాటు ఆ ముఖ్య సీన్స్‌ను రీ షూట్ చేయబోతున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికి షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల రిపబ్లిక్ డే సందర్బంగా చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ చిత్రాలతో నిరాశ పర్చిన మహేష్‌బాబు ఈ చిత్రంతో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి.