ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆగ్రహించిన అమరావతి రైతులందరూ కూడా గత 17 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ రైతుల విషయంలో సీఎం జగన్ స్పందించని కారణంగా తమ ఆందోళనలు మరింతగా ఉదృతం చేస్తూ, రైతులందరూ కూడా సకల జనుల సమ్మె చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు (శనివారం నాడు) రైతులు నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా ఒక దారుణమైన విషాదం చోటు చేసుకుంది.
కాగా దొండపాడు ప్రాంతానికి చెందిన కొమ్మినేని మల్లికార్జున రావు అనే రైతు గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా గత 17 రోజులుగా రాజధాని అమరావతిని తరలించొద్దని నిర్వహిస్తున్న ధర్నాల్లో పాల్గొన్న మల్లికార్జునరావు… శుక్రవారం నాడు కారణంగా మరింతగా ఆవేదనకు గురై తీవ్ర ఆవేదన చెందాడు… ఈ తరుణంలో అతనికి గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందాడు… కాగా గతంలో రాజధాని అమరావతి నిర్మాణానికి మల్లికార్జున రావు తన 10 ఎకరాల భూమిని ఇచ్చారని సమాచారం.