తెలంగాణలో ఘోరం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుటే రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి అనే రైతు.. కాల్వశ్రీరాంపూర్ ఎమ్మార్వో కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.