17 వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

17 వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూ, తీవ్రమైన ఆందోళనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ రైతుల ఆందోళనలు నేటికీ 17 వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని ఎక్కడికి తరలించొద్దని, అమరావతిలోని రాజధానిని కొనసాగించాలని రైతులందరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులందరూ కూడా ఇంతలా కష్టపడుతూ, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు, తమ పోరాటాన్ని మరింతగా ఉద్ధృతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

ఈమేరకు రైతులు నేటి నుండి నుంచి సకలజనుల సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా తుళ్లూరులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) గా ఏర్పడి ఈ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. అయితే నిత్యావసరాలు, ఎమర్జెన్సీ మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయనున్నారు. ఇకపోతే నేడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించడానికి సిద్దమైంది. అయితే ఆ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే ఇవ్వనుందని ప్రచారం జోరుగా సాగుతుంది.

ఈ నేపథ్యంలో రైతులు సకలజనుల సమ్మెతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచాలని రైతులు భావిస్తున్నారు. ఇకపోతే ఎన్ని నివేదికలు ప్రభుత్వం చెంతకు చేరినప్పటికీ కూడా విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలనీ వైసీపీ నేతలందరూ కూడా నిర్ణయించుకున్నారంట. అయితే ఈ తరుణంలో రైతులు జరుపనున్న సకలజనుల సమ్మె ప్రభుత్వంపై ఎంత వరకూ ఒత్తిడి పెంచుతుందనే విషయం ప్రస్తుతనైకి చర్చనీయాంశంగా మారింది.