రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు

రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు

ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని అంశం తీవ్ర చర్చానీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులను తెరపైకి తీసుకురావడంతో రాజధాని అమరావతి రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. అయితే నేడు జనసేన పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వైఖరిపై మరోసారి మండిపడ్డారు.

అయితే ఈ సమావేశంలో రాజధాని అమరావతి వివరాలకు సంబంధించిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ అందించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతున్న క్రమంలో మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల ఆందోళనలపై చర్చించేందుకు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.